అనుకున్నదొక్కటి అయినది మరొకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా..ఇప్పుడు ఈలిరిక్స్ టీంఇండియా కు సరిగ్గా సరిపోతుంది. టీ20 ప్రపంచకప్ కప్ 2022లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన భారత్ కథ సెమిస్ లోనే ముగిసింది. కెప్టెన్ రోహిత్ సారథ్యంలోనైనా టీంఇండియా ఖచ్చితంగా ఐసీసీ టోర్ని గెలుస్తుందని భావించిన.. కోట్లాది మంది భారత ప్రేక్షకుల ఆశలపై ఇంగ్లీష్ జట్టు నీళ్లు చల్లింది. మ్యాచ్ అసాంతం ఇంగ్లాడ్ ఆటగాళ్లు అధిపత్యం ప్రదర్శించారు .అసలు మ్యాచ్ చూస్తున్నంత సేపు సెమిస్ ఆడుతున్నది భారత జట్టేనా అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి కలిగిందంటే.. మ్యాచ్ ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంమీద భారత ఆటగాళ్లలో విజయకాంక్ష లోపించిందన్నది కొట్టిపారేయలేని వాదనగా చెప్పవచ్చు.
ఇక వరల్డ్ కప్ 2022 లో దాయాది పాక్ అనూహ్యంగా ఫైనల్ కి చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మరోసారి దాయాదుల సమరం కన్ఫర్మ్ అని భావించారు.సెమిస్ లో ఇంగ్లాడ్ జట్టును టీంఇండియా జట్టు అలవోకగా ఓడిస్తుందని అభిమానులు అంచనావేశారు.అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది ఇంగ్లీష్ జట్టు. మ్యాచ్ కు ముందు తమతో జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారిచేశారు ఇంగ్లాడ్ ఆటగాళ్లు. అన్నట్టుగానే టాస్ నుంచి మొదలుపెడితే.. గెలుపు చివరి బంతి వరకు అన్ని విభాగాల్లో పూర్తి అధిపత్యం ప్రదర్శించారు.తమదైన రోజును ఎవరూ ఆపలేరు తరహాలో రెచ్చిపోయి ఆడారు. ఫలితం టీంఇండియా సెమిస్ లోనే ఇంటిదారి పట్టింది. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.
కెప్టెన్ ..ఆటగాడిగా రోహిత్ ఫేయిల్…
భారత ఆటగాళ్ల ప్రదర్శనకొస్తే చెప్పుకొవల్సింది సారథి రోహిత్ శర్మ గురించి. ఎందుకంటే జట్టును ముందుండి నడపాల్సిన బాధ్యత అతనిపై ఉంది. కానీ తీరా చూస్తే మేడిపండు మాదిరి ఆట ..నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికి తనదైన మార్క్ హిట్ మ్యాన్ లో లోపించింది. నెదర్లాండ్స్ మినహా మిగతా జట్లపై అతని ఆటతీరు అధ్వాన్నం. కీలకమైన సెమిస్ లోనూ చాలా సేపు క్రీజులో ఉన్నప్పటికి తనదైన ఆట ఆటడంలో ఫేయిలయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిగా అనిపించిన అతను.. పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. మొత్తంమీద రోహిత్ కు ఔట్ ఆఫ్ 10/ 2 మార్క్స్ ఇవ్వొచ్చనే చెప్పవచ్చు.
కింగ్ కోహ్లీ..
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ ..ఈవరల్డ్ కప్ లో చారిత్రాత్మక ఇన్నింగ్స్ .. పరుగుల చేశాడు. టోర్నికి ముందు పేలవ ఫామ్ తో తంటాలు పడ్డా.. పరుగుల వీరుడు వరల్డ్ కప్ తో ఫామ్ అందుకున్నాడు. ఒకటి రెండు మ్యాచ్ లు మినహా మిగతా మ్యాచ్ లో ఇరగదీశాడు.ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాక్ పై చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే వరల్డ్ కప్ భావిస్తున్న అభిమానులకు తనలో ఇంకా చాలా ఆటదాగి ఉందని ఆటతో ఫ్రూవ్ చేసుకున్నాడు. అభిమానులు ముద్దుగా పెట్టుకున్న కింగ్ కోహ్లీ బిరుదుకు విరాట్ పూర్తిగా న్యాయం చేశాడు. మొత్తంమీద విరాట్ కు ఔట్ ఆఫ్ 10/ 9 మార్క్స్ ఇవ్వొచ్చు.
వరల్డ్ నెంబర్ వన్ ..స్కై..
స్కై అలియాస్ సూర్యకుమార్ యాదవ్. జాతీయ జట్టులోకి రావాడానికి నానాతంటాలు పడ్డ .. .ఈపరుగుల వీరుడు. వరల్డ్ కప్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లతో అభిమాలను అలరించాడు.తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో రెచ్చిపోయి ఆడాడు. ఇటీవల ప్రకటించిన ఐసీసీ వరల్డ్ టీ20 బ్యాట్స్ మెన్స్ లలో నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.మొత్తంమీద సూర్యకు ఔట్ ఆఫ్ 10/8 మార్కులు ఇవ్వవచ్చు.