దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు !

దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఇక గడిచిన 24 గంటల్లో 16 వేల 159 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారితో 28 మంది ప్రాణాలు కోల్పో యినట్లు తెలిపింది.

ఇక కరోనా నుంచి 15 వేల 394 మంది కోలుకున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు సంఖ్య 0.26 శాతంగా ఉంది.రోజువారి పాజిటివిటీ రేటు 3.56 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. కేసులు పెరుగుతుండటంతో టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. నిన్న ఒక్కరోజే 9 లక్షలకు పైగా అందించామన్నారు. ఇప్పటివరకు 4 లక్షల 54 వేల 465 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు.