Headlines

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరేట్‌ :ఇంజామామ్‌ ఉల్‌ హక్‌

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ ఉంటే ఆ మజానే వేరు. రెండు దేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండూ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతుంది. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డక.. ఇప్పుడు టి 20 ప్రపంచ కప్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి.
ఇకపోతే ఈ మ్యాచ్లో కోహ్లీసేన హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ దే పైచేయి.
కాగా పాక్ మ్యాచ్ కంటే ముందురోజే తమ 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్​ జట్టు బలంగా కనిపిస్తోందని అన్నాడు. ప్రత్యర్థి జట్టుపై 100 శాతం గెలిచే అవకాశమున్నా.. ఆ జట్టును అశ్రద్ధ చేయకూడదని, అందులోనూ గేమ్​ ఛేంజర్స్ ఉన్నారని అభిప్రాయపడ్డాడు.
మరోవైపు పాకిస్థాన్ సీనియర్ ఆటగాడు ఇంజామామ్‌ ఉల్‌ హక్‌.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరేట్‌ అన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసిన భారత జట్టు ఛాంపియన్‌ నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంజామామ్ పేర్కొన్నాడు.

Optimized by Optimole