ఇంగ్లాడ్ తో తొలి టెస్ఠులో పటిష్ట స్థితిలో భారత్..!1

ఇంగ్లాడ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తొలిరోజు 338 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో(146) చెలరేగాడు. అతనికి రవీంద్ర జడేజా(83*) తోడవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (11) స్వల్ప స్కోర్ కే జౌటయ్యాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంత్ _ జడేజా జోడి ఆదుకుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. టాప్ ఆర్డర్ విఫలమవడంతో.. కష్టాల్లో పడింది. ఈనేపథ్యంలో క్రీజులోకి వచ్చిన పంత్ ఆచూతూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరగులు పెట్టించాడు. అతనికి జడేజా నుంచి పూర్తి సహకారం లభించింది. అతను 89 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. జడేజా సైతం తన ఆటకు భిన్నంగా ఆడుతూ అర్థసెంచరీ పూర్తి చేశాడు.