Headlines

నాలుగో టి-20లో ‌ఇంగ్లాడ్‌పై భార‌త్‌ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రుగుతున్న టీ-20 సిరిస్లో భాగంగా తప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో టీం ఇండియా అద‌ర‌గొట్టింది. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ నాలుగో టి-20లో భార‌త్‌ ‌ 8 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌పై గెలిచి సిరిస్ స‌మం చేసింది. మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన భార‌త్.. సూర్య‌కుమార్ యాద‌వ్ (57 : 31 బంతుల్లో 6*4, 3*6) చెల‌రేగ‌డంతో నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 8 వికేట్ల‌కు 185 పరుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (37), రిష‌బ్ పంత్ (30) రాణించారు. 186 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాడ్ నిర్ణిత ఓవ‌ర్ల‌లో 177 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టులో రాయ్ (40), స్టోక్స్ (46) రాణించారు. భార‌త్ బౌల‌ర్ల‌లో శార్దుల్ ఠాగుర్ మూడు,హ‌ర్దిక్ పాండ్యా రెండు, చాహ‌ర్ రెండు వికెట్లు తీసి భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. సిరిస్ నిర్ణ‌యాత్మ‌క చివ‌రి టీ-20 శ‌నివారం జ‌రుగుతుంది.

Optimized by Optimole