దేశంలో కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య అధికంగా ఉందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల విషయంలో కేంద్రం ఆందోళనగా ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఫలితం మాత్రం లేదని.. దీనిపై చాలా సీరియస్‌గానే ఉన్నామని తెలిపారు.
కరోనా కారణంగా 1.46 లక్షల మంది మరణించగా .. రోడ్డు ప్రమాదాలతో 1.5 లక్షల మంది మృతి చెందారని గడ్కరీ పేర్కొన్నారు. కాగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారందరూ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కావడం జీర్ణించుకోలేని విషయమని గడ్కరీ అన్నారు.