సైన్స్ కే అంతు పట్టని వ్యక్తి!

ఒక పూట ఆహారం లేకపోతేనే ఆకలిరా బాబు అంటు కేకలు పెడతాం. అలాంటిది 70 సంవత్సరాల నుండి ఆహారాన్ని తీసుకోవడం లేదు ప్రహ్లాద్ జోషి.  1940 నుండి నీరు ఆహారం తీసుకోకుండా జీవిస్తున్న ఇతను.. ఎటువంటి అనారోగ్యం లేకుండా, శక్తివంతంగా జీవిస్తున్నాడు. అందరూ ఇతనిని మాతాజీ అని పిలుస్తారు. చుందాదివాలా మాతాజీ అని కూడా అంటుంటారు. ఇతనొక సాధువు. అంబ దేవతను పూజిస్తూ, ఆ దేవత ధ్యానంలోనే ఉంటాడు. మాతాజీ నీరు, ఆహారం నిజంగానే తీసుకోవడం లేదా అబద్ధాలు చెబుతున్నారా? అని తెలుసుకోవడానికి ఊరి ప్రజలు ఎన్నో సార్లు పరీక్షించి,విఫలమయ్యారు. ప్రస్తుతం ఆ సాధ్వు గుజరాత్ లోని చారద గ్రామంలో ఉంటున్నారు. ఆయన ఎప్పటి నుండి ఇలా ఆహారం తీసుకోలేదు, ఎందుకు ఇలా ఉంటుండానేది తెలుసుకుందాం!
మాతాజీ(జోషి) తన ఏడేళ్ళ వయసులో రాజస్థాన్ లోని తన ఇంటి నుండి పారిపోయి అడవులలో జీవించేవాడు. తన 11 ఏట హిందూ దేవత అయిన అంబాదేవతను భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టాడు. దేవత ఆరాధనలో ఉన్న అతను,అంబవారిలాగే తన వస్త్రాలంకరణను చేసుకునేవాడట. ఎర్రటి చీర, ఆభరణాలు ధరించి, తన జుట్టును భుజాల వరకు పెంచుకొని, జుట్టుపై పూలు పెట్టుకునేవాడట.

అంబ దేవతే ఆకలి తీరుస్తుంది!
తన ఆకలిని అంబ దేవతే తీరుస్తుందని ఆయన నమ్మేవారు. కొన్ని నీటి బిందువులను తన అంగుడి (నుదుటి భాగంలో)పై జారవిడచి ఆయనకు ఎటువంటి మంచి నీరు, ఆహారం అవసరం లేకుండా ఆకలి తీర్చేదట. 1970లో గుజరాత్ లోని అడవిలోగల అంబాజీ ఆలయంలో మతాజీ నివసించేవాడు. తెల్లవారుజామున గం.4లకు నిద్ర లేచి అంబదేవత ధ్యానంలో ఉంటూ, ఆ దేవత ఆరాధన చేసేవాడు.

అతడిపై  పరిశోధనలు చేశారు:
ఇలా చాలా సంవత్సరాలుగా ఎటువంటి నీరు, ఆహారం లేకుండా జీవిస్తున్న జనిని 2003లో డాక్టర్ సుదీర్ షా పర్యవేక్షణలో, స్టెర్లింగ్ హాస్పిటల్ లో పరిశీలించారు. ఆయనపై ఉన్న అనుమానంతో ఒక గదిలో 10 రోజుల పాటు ఉంచారు.ఈ 10 రోజులలో ఆయన ఎక్కడా కదలకుండా, మలవిసర్జన కూడా చేయలేదని ఆ వైద్యులు తెలిపారు. అయితే ఈ 10 రోజులలో బీీరువు తగ్గడంవారు గమనించారు. ఆహారం తీసుకోకపోవడంవలనే ఆయన బరువు తగ్గి ఉంటారని వారికొక అనుమానం ఉండేది.

2003లో అతనిని పరిశీలించిన డాక్టర్ సుదీర్ షాతో పాటు మరో 35 మంది వైద్యులు ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫిజియాలజీ మరియు అలైడ్ ఆర్గనైజేషన్, ఇంకా కొన్ని సంస్థలు అతనిని ఏప్రిల్ 22 నుండి మే6,2010వరకు పరిశీలించారు.

అతడిని ఒక గదిలో ఉంచి, అక్కడ సీసీ కెమెరాలు పెట్టి,ప్రతిరోజూ బ్లడ్ టెస్ట్, స్కానింగ్.. ఇలా ఆయనపై పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 15 రోజులలో ఆయన ఒక్కరోజూ కూడా టాయిలెట్ కు వెళ్ళలేదు సరికదా అన్ని మెడికల్ రిపోర్ట్స్ చెప్పింది ఒకటే ఆయన సాధారణగానే ఉన్నారని.