లంకతో టీ20.. బోణీ కొట్టిన భారత జట్టు!

శ్రీలంకతో టీ20 సిరీస్​లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్​లో భారత జట్టు బోణీ కొట్టింది. 200 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు 137 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఓపెనర్లు శుభారంభం:
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు..కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. వీరికీ తోడు శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లంక బౌలర్లలో లాహిరు కుమార, శనక చెరో వికెట్ తీశారు.

ఇక 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో చరిత్ అసలంక అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,వెంకటేష్ అయ్యర్ చెరో రెండు వికెట్లు.. చాహల్, జడేజా తలా వికెట్ పడగొట్టారు.