పివోకే పై భారత సైన్యాధికారి కీలక వ్యాఖ్యలు..

పివోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్ ) పై భారత సైన్యాధికారి లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే.. పాకిస్తాన్  ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో 300 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారని.. మరో 160 మంది దేశంలోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్  వైపు లాంచ్ ప్యాడ్ లలో ఉన్నట్లు తెలిపారు. ఆర్టికల్  370 రద్దు తర్వాత భద్రతా పరిస్థితి మెరుగైందని వెల్లడించారు. ఉగ్ర కార్యకలాపాలను చాలా వరకు కట్టడి చేసినట్లు ద్వివేది పేర్కొన్నారు.

 

Optimized by Optimole