కేసిఆర్, కేటీఆర్ పై పేలుతున్న సెటైర్స్.. వదల బొమ్మాళి వదల అంటున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. అబ్బా, కొడుకులు మాటలే తప్ప.. చేతల నేతలు కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.  ఇంతకు వీరిద్దరినీ నెటిజన్స్ టార్గెట్ చేయడం వెనక ఉద్దేశ్య ఎంటి? తెలంగాణలో దర్యాఫ్తు సంస్థల దాడుల కలకలం వేళ  ట్రోల్ చేయడం ఎంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 

కాగా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్.. చావు తప్పి కన్ను లొట్ట బోయిన తరహాలో గట్టెక్కింది. ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్..ఉప ఎన్నికలో గెలిపిస్తే మునుగోడు దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే  ఎన్నిక ముగిసి మూడు వారాలు పూర్తి కావొస్తున్న… హామీ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో నెటిజన్స్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు.ట్విట్టర్ టిల్లుకు ఎన్నికలు వస్తేనే..దత్తత హామీ గుర్తొస్తుందని వ్యంగ్యంగా కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

అటు సీఎం కేసీఆర్ తో పాటు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సైతం నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.” ఏం కూసుకుంట్ల ప్రభాకర్ గారు ఇలా వచ్చారు ఏంటి విషయం?” అంటే కేసీఆర్ కుశల ప్రశ్న అడగ్గా..వెంటనే ” సర్ మునుగోడులో 15 రోజుల అభివృద్ధికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది..రెండు రోజుల తర్వాత నా పరిస్థితి ఏంటి  సార్ ” అంటూ కూసుకుంట్ల ధీనంగా సమాధానమిస్తాడు.వెంటనే కేసిఆర్..  ” ఏ ఊరుకోవయ్య..మనది బంగారు తెలంగాణ..ఇంకా కొత్తగా అభివృద్ధి ఏంటి ? అంటున్న మిమ్స్ నెట్టింట్లో ట్రెండిగ్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ నవ్వులు పూయించేలా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక గండం నుంచి బయటపడిన టీఆర్ఎస్ ను మాత్రం ‘ వదల బొమ్మాళి వదల’ తరహాలో హామీలను ఎత్తిచూపుతూ  వెంటాడుతున్నారు.