మరోసారి హాట్ టాపిక్ గా పంత్-ఊర్వశి రౌట్ వ్యవహారం

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా , క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడంతో..ఆమె సోషల్ ఖాతాను బ్లాక్ చేసి పంత్ రూమర్స్​కు చెక్ పెట్టాడు. తాజాగా అతను ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి పేరు చెప్పుకుండా ఆర్పీ అని ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. వారణాసిలో ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్ళాను. అనంతరం ఓ షో కోసం అత్యవసరంగా ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. మర్నాడు తిరిగి ఢిల్లీకి రావాల్సి ఉంది. ఆ సమయంలోనే నన్ను కలవడానికి నేను ఉంటున్న హోటల్ కి ఆ వ్యక్తి వచ్చాడు. నేనా ఆ సమయంలో.. షూటింగ్ చేసి అలసిపోవడంతో నిద్రపోయాను. లేచి చూసే సరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అతను వచ్చి వెయిట్ చేస్తున్న విషయం ఆలస్యంగా తెలిసింది. నేను చాలా ఫీల్ అయ్యాను. దీంతో వెంటనే అతనికి కాల్ చేసి బాగా టైడ్ అయ్యాను.. ముంబైకి వచ్చాక కలుస్తానని చెప్పాను. మాట ప్రకారం వెళ్లి కలిసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఊర్వశి కామెంట్స్ పై స్పందించిన రిషబ్…ఆమె పేరు ప్రస్తావించకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనదైన శైలిలో చురకలంటించాడు. ” కొందరు పాపులారిటీ కోసం పాకులాడతారు. ఇంటర్వ్యూలో నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతారు.అలాంటి వాళ్ళను చూస్తే జాలేస్తుంది. వారిని దేవుడు చల్లగా చూడాలి అంటూ పోస్ట్ రాసుకోచ్చాడు.