ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ  ప్ర‌క‌టించింది. 18 మందితో కూడిన జట్టులో  సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి స్థానం‌ దక్కింది.  పేసర్  భువనేశ్వర్ కుమార్ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. షమీ, జడేజాలు గాయాల నుంచి కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీీలించలేదు. టీ20 సిరీస్‌కు దూరమైన నటరాజన్‌ వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న కృనాల్‌ పాండ్యాకు వన్డే జట్టులోను చోటు దక్కింది.

భారత జట్టు:  విరాట్ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ(వైస్‌ కెప్టెన్‌)‌, ధావ‌న్‌, శుభ్‌మ‌న్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్యకుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, కెఎల్ రాహుల్‌, చాహ‌ల్‌, కుల్‌దీప్‌, కృనాల్‌ పాండ్య, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, భువ‌నేశ్వ‌ర్‌ కుమార్, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, శార్దూల్ ఠాకూర్.

Optimized by Optimole