తీరుమారని ముంబై..లఖ్నవూ చేతిలో ఓటమి!

ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్​ రాత మారలేదు. శనివారం లఖ్​నవూ చేతిలో జరిగిన ఆరో మ్యాచ్లోనూ ముంబై జట్టు18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​ చేసిన లఖ్​నవూ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20ఓవర్లలో 199 పరుగులు చేసింది. మనీశ్ పాండే, క్వింటన్ డికాక్ ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి జట్టు 181 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో బ్రెవిస్ ,సూర్యకుమార్ ఉన్నంతసేపు పోరాడారు. లఖ్​నవూ బౌలర్లలో అవేశ్​ ఖాన్ 3 వికెట్లతో సత్తాచాటాడు. హోల్డర్, రవి బిష్ణోయ్, స్టోయినిస్, చమీరా తలో వికెట్ తీశారు.

Optimized by Optimole