ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు కెప్టెన్ గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ గా అవకాశమిచ్చిన సీఎస్కే యాజమాన్యం.. జట్టు వరుస ఓటములతో తిరిగి ధోని కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో 2023 సీజన్ కి సంబంధించి చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే సీజన్ కి మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్ ఉంటాడని ఆయన స్పష్టంచేశారు.
ఇక 2008 లో చెన్నై జట్టు కెప్టెన్ పగ్గాలు చేపట్టిన ధోని.. నాలుగు సార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని నాయకత్వంలో జట్టు అత్యధికంగా ఆరు సార్లు ఫైనల్ చేరింది. ఆటగాడిగా.. కెప్టెన్ గా జట్టు విజయంలో ధోని పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని జట్టు యాజమాన్యం అనేక సార్లు వెల్లడించింది.
కాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. గత సీజన్లో ఐపీఎల్ కు గుడ్ బై చెబుతాడని వార్తలు వచ్చాయి. గత సీజన్లో అనూహ్యంగా కెప్టెన్ పగ్గాలు వదిలేయడంతో ధోనీకి అదే లాస్ట్ సీజన్ అవుతుందని అందరూ ఊహించారు. టోర్నికి ముందు.. కెప్టెన్సీ వదిలేసిన ఆటగాడిగా కొనసాగుతానని.. సమయం వచ్చినప్పుడు ఐపీఎల్ నుంచి వైదొలిగే విషయంపై ఆలోచిస్తానని ధోని తేల్చిచెప్పాడు . 2023 సీజన్లో నూ ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో మరోసారి అతనిపై నమ్మకం ఉంచిన చెన్నై జట్టు యాజమాన్యం..మరోసారి ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటన చేసింది.