జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియలో భాగంగా కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్ దేవ్‌సర్ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. వారిలో ఒకరు పాకిస్థాన్ ఉగ్రవాది హైదర్‌గా గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.