janasena: న భూతో న భవిష్యతి అనేలా ఆవిర్భావ సభ: నాదెండ్ల
Janasena: ‘పిఠాపురం జనసేన పార్టీకి ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు కూడా పిఠాపురం వేదిక అయింది. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకొందాం.. థాంక్యూ పిఠాపురం’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో నిర్వహిస్తున్నామని, దీనికి పార్టీలోని ప్రతి ఒక్కరూ మమేకం కావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం “జయ కేతనం” సభ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఆసాంతం పరిశీలించి తగు సూచనలు అందించారు. సభా ప్రాంగణం మొత్తం కలియ తిరిగి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఏ కమిటీ ఎలా పని చేయాలి? ఎక్కడ పని చేయాలి అన్న వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. కమిటీల సభ్యులకు తగు సూచనలు అందించారు. అనంతరం రాష్ట్ర నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో సభా ప్రాంగణంలోనే మనోహర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అయ్అన మాట్లాడుతూ “గతంలో ఆవిర్భావ సభ జరిపినప్పుడు బందోబస్తు కోసం కోరితే పోలీస్ శాఖ పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అంతంత మాత్రమే స్పందించేది. ఇప్పుడు ఆవిర్భావ సభ కోసం ఏకంగా 1600 మంది పోలీసులు బందోబస్తు కోసం రావడం శుభ సూచకం. కేవలం పిఠాపురం నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, రాష్ట్రంలోని నలువైపుల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది. వారికి తగినంతగా మనం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ తరఫున నియమించిన కమిటీలు ఎప్పటికి అప్పుడు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నాయకుడికి నిండు మనసుతో కృతజ్ఞత చెప్పుకోవాలి..
జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు, అవరోధాలు దాటి ఇప్పుడు ఇంత ఘనమైన పండుగ నిర్వహించుకుంటున్నామంటే మనమంతా నాయకుడికి కృతజ్ఞులై ఉండాలి. ఆయన మనకు సమాజంలో తీసుకొచ్చిన గౌరవం, పార్టీ ద్వారా ఆయన ఆశయాలకు తోడు నిలవడం మనకు ఓ మధురానుభూతి. దీనికి మనం ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూనే ఉండాలి. అధికారం లేనప్పుడు ప్రజల కోసం ఎలా పోరాటాలు చేశారో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజల కోసం అంతే తపిస్తున్నారు. తన పరిధిలో ఉన్న శాఖల ద్వారా విశేషంగా ప్రజలకు సేవలు అందించాలని పాలన సాగిస్తున్నారు. ఓ గొప్ప పోరాటం తాలూకా ఫలితం తర్వాత వచ్చిన గొప్ప సమయం ఇది. దీన్ని మనమంతా ఉత్సవంలా జరుపుకుందాం. మచిలీపట్నం తర్వాత నిర్వహించిన అతి పెద్ద సభగా ఇది నిలుస్తుంది. దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా నిర్వహించనంత ఘనంగా జయ కేతనం సభ ఉండబోతోంది. ఇది మనమంతా గర్వించదగ్గ సమయమని నాదెండ్ల స్పష్టం చేశారు.