బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవారా మనల్ని పాలించేది?: పవన్

Janasenavarahi: సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు.. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే, చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలని..? విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.18 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంలో, బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిన నాయకత్వంలో, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిన నాయకుడి పాలనలో మనమున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సంపదను దోచి, మళ్లీ దాన్ని ప్రజలకు పంచి పెట్టే నాయకులు కావాలో, సంపద సృష్టించి అన్నీ వర్గాలకు పంచి పెట్టే పాలన కావాలో ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా  కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…  ‘‘ అధికార మదంతో ఎన్ని అడ్డంకులు, ఎన్ని వ్యూహాలు పన్నినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ శాసనసభలో అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పారు. నిజాయతీ గల శాసన సభ్యులు చట్ట సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ప్రజల గొంతు బలంగా వినిపిస్తామని..వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ ఒంటరిగా వస్తుందా? ఉమ్మడిగా వస్తుందా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. ఆ రోజు వస్తే కచ్చితంగా ప్రజల మధ్యనే పారదర్శకంగా చెబుతామని స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో గత ఎన్నికల్లో నేను ఓడిపోయాలా చేశారని.. లక్షమంది ఓటర్లు ఉన్న భీమవరంలో 1.08 లక్షల ఓట్లు పోలయ్యాయని.. ఇది కుట్ర కాకా ఇంకేంటి? ఈ సారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానని ఛాలెంజ్ విసిరారు. యాత్ర రథనానికి వారాహి అనే పేరు నేను కోరుకుంటే రాలేదని.. నేను నిత్యం పూజించే ఆ తల్లి చల్లని దీవెనలు నా వెంట ఉన్నాయి కనుకే ఈ వాహనానికి వారాహి అనే పేరు వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు.

సంక్షేమానికి జనసేన వ్యతిరేకం కాదు… వైసీపీ విధానానికే మేం వ్యతిరేకం…

సంపద సృష్టించి దాన్ని అర్హులకు తగిన విధంగా అందించడాన్ని సమర్థిస్తామన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న వెయ్యిమంది కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున  సొంత సంపదను సహాయంగా అందించామన్నారు. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాల ద్వారా నా కష్టం నుంచి వచ్చిన సంపదను సాయంగా ఇవ్వగలిగానని.. అంటే అక్కడ సంపదను సృష్టించబట్టే మేం వారికి అండగా నిలబడగలిగామని చెప్పు కొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ రాదు.. ఉద్యోగాలు లేవు.. పన్నుల బాదుడుతో ప్రజలు నలిగిపోతున్నారు.. మరో పక్క భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమం అంటున్నారు. ఇదేం తీరు..? అప్పులు చేసి గొప్పతనం అంటే ఎలా..? సంపద సృష్టికి రాష్ట్రంలో అపార అవకాశాలున్నా దాన్ని వినియోగించుకోకుండా, అప్పులు చేసి డబ్బులు పంచడం అంటే భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమేనని జన సేనాని మండిపడ్డారు. జనసేన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉంటాయి. దానికి తగినట్లుగా రాష్ట్రంలో అన్నీ మార్గాల ద్వారా సంపదను పెంచి సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటాం. చెత్త పన్ను దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ల ఫీజులు వరకు అన్నీ పన్నులు పెంచేశారు. ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బునే మళ్లీ పంచుతూ రాబిన్ హుడ్ లా ముఖ్యమంత్రి మాట్లాడటం చూస్తే నవ్వొస్తోందన్నారు. 200 మంది అమరావతి రైతుల ఆత్మహత్యలకు జవాబు చెప్పేవారెవరని పవన్ ప్రశ్నించారు.

పాపం పసివాడా… చిన్నాయనను చంపిందెవరో చెప్పు..?

పాపం పసివాడులా మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సొంత చిన్నాయనను చంపిన వారిని శతవిధాలా రక్షించేందుకు తాపత్రయ పడుతున్నారని పవన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాబాయి కూతురు న్యాయం పోరాటం చేస్తుంటే దాన్ని కనీసం పట్టించుకోని ఈయన క్లాస్ వార్ గురించి మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తుందని ఎద్దేవ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ బలవంతుడు, రాజకీయ బలహీనుడు అనే రెండు వర్గాల మధ్యనే పోరు నడుస్తోందన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారి కోసం న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సుజాతకు కోర్టులో కనీసం వాదించేందుకు అడ్వకేట్లు దొరకని పక్షంలో సొంతంగా కేసు వాదించుకుంటూ వ్యవస్థలోని రాజకీయ బలవంతానికి సజీవ సాక్షిగా నిస్సహాయంగా నిలబడిపోయిందన్నారు. కేసులో అన్నీ చేతులు సీఎం ఇంటి వైపే చూపిస్తున్నాయని.. అయినా న్యాయం అందని పరిస్థితి ఉందన్నారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న వారిని సైతం ముఖ్యమంత్రి ఎదుట చేతులు కట్టుకునేలా చేసి, సీఎం క్లాస్ వార్ గురించి మట్లాడటానికి సరిపోరని పవన్ తేల్చిచెప్పారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole