కార్యకర్తలకు జ‌న‌సేన అండ‌గా ఉంటుంది : నాదెండ్ల మ‌నోహ‌ర్‌

జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైందన్నారు నాదెండ్ల‌. ఈ ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు సాగుతుందన్నారు. రాజకీయ పార్టీ కార్యకర్తలంటే ఇప్పటి వరకు రాజకీయంగా ఉపయోగించుకోవడం వరకే పరిమితం అయ్యేవారని.. జనసేన మాత్రం వారిని ఆపదలో ఉంటే ఆదుకునే ఆలోచన చేసిందన్నారు. కార్యకర్తలకు భరోసా క‌ల్పించ‌డం.. వారి కుటుంబాల్లో మ‌నో ధైర్యం నింపేందుకు ఆర్థిక సాయం చేయాలనే ఆలోచన చేసిన‌ పవన్ కళ్యాణ్ మ‌న‌సు గొప్ప‌ద‌ని కొనియాడారు . ప్రమాదవశాత్తు క్రియాశీలక కార్యకర్తకు జరగరానిది జరిగితే, పార్టీ నుంచి వారి కుటుంబానికి ఆప‌న్న హ‌స్తం అందించే ప్రక్రియని మ‌నోహ‌ర్ తేల్చిచెప్పారు.

Optimized by Optimole