శాండల్ వుడ్ పవర్ స్టార్ కు గుండె పోటు..?

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఆసుపత్రిలో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా సోదరుడు శివ రాజ్‌కుమార్ తెలిపారు. కన్నడ నటుడు యష్, సీఎం బసవరాజ బొమ్మి, నటి శృతి ఆసుపత్రిలో ఉన్నారు. ఇక ఈ విషయం తెలిసిన పునీత్ రాజ్‌కుమార్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన హెల్త్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను తెలియజేస్తూ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా విడుదల చేయనున్నాయని తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్.. యువరత్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పునీత్. 29 సినిమాలలో హీరోగా నటించి విపరీతమైన స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నారు.