న‌ల్ల‌గొండ జిల్లా పోలీస్ కార్యాల‌యంలో ‘కంటివెలుగు’ శిబిరం..

న‌ల్ల‌గొండ‌ : జిల్లా పోలీస్ కార్యాల‌యంలో కంటివెలుగు -2 వైద్య శిబిర కార్య‌క్ర‌మాన్ని ఎస్పీ అపూర్వ‌రావు ప్రారంభించారు. తెలంగాణ‌  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరూ టెస్టులు  చేయించుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. పోలీస్ అధికారులు,సిబ్బంది, వివిధ విభాగాల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న వారందరికి ఒకే రోజు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి.. పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ వైద్య శిబిరాన్ని కొనసాగించడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నరసింహ రెడ్డి, రమేష్, ఏ.ఓ మంజు భార్గవి,సీఐ లు ఆది రెడ్డి,వీర రాఘవులు, మహేశ్వర్, సత్యం ఆర్.ఐ లు స్పర్జన్ రాజ్,హరిబాబు,శ్రీను,సంతోష్, పోలీస్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్‌ కుమార్,పోలీస్ అధికారుల సంఘం నాయకులు సోమయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Optimized by Optimole