కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని..విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హిజాబ్ వివాదంపై తీర్పును వెలువరించింది.
కాగా ఈ ఏడాది జనవరిలో, ఉడిపి పాఠశాల్లో హిజాబ్ వస్త్రధారణ పై వివాదం చెలరేగింది. దీంతో కొంతమంది బాలికలు ఈ వివాదంపై హైకోర్టనూ ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు.. ఫిబ్రవరి 25న ఈ కేసు తీర్పు రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి నిరసనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అయితే హిజాబ్ తీర్పుకు ముందు.. బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలన్నింటిని మూసివేయించారు.