శ్రీలంకపై రెండో టెస్టులో భారత్ ఘననిజయం..!

శ్రీలంక తో జరుగుతున్న పింక్‌ బాల్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 447 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీం ఇండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులో దిముత్‌ కరుణరత్నె సెంచరీతో రాణించగా (107).. కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంతో (54) మెరిశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగు.. బుమ్రా మూడు.. అక్షర్‌ పటేల్‌.. రెండు రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా.. లంక జట్టు 109 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాకు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 303/9 స్కోరు వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్‌ని డిక్లేర్‌ చేసింది. దీంతో 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. భారత బౌలర్ల ధాటికి 208 పరుగులకే చేతులెత్తేసింది. ఇక ఈ గెలుపుతో టీం ఇండియా టెస్ట్ సీరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.