ఖేలో ఇండియా, ఖేలో ముద్దు…. పీలో ఇండియా, పిలావో వద్దు: బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ‘‘ఖేలో ఇండియా’’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. క్రీడల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. సమాజానికి ‘‘ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ ముద్దు… పీలో ఇండియా… పీలావో తెలంగాణ వద్దని’’ బండి పిలుపునిచ్చారు . బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్ర్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు దరువు ఎల్లన్న, సొల్లు అజయ్ వర్మ, ఓరుగంటి ఆనంద్, గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా విజేతలకు బండి సంజయ్ బహుమతులను అందజేశారు. క్రీడా నిర్వాహకులను, టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన స్థానిక నేతలను సత్కరించారు.

కాగా క్రీడల వల్ల మానసిక, శారిరక ఉల్లాసం వస్తుందన్నారు సంజయ్. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్కంట ఉంటుందని.. దేశం పట్ల అభిమానం నిరంతరం ఉండాలే తప్ప తాత్కాలికం కాకూడదని తేల్చిచెప్పారు. ఖేలో ఇండియా’’ పేరుతో దేశవాళీ క్రీడలను ప్రోత్సహిస్తున్న ఘనత నరేంద్రమోదీదేని స్పష్టం చేశారు. క్రీడాకారులను గెలుపోటములతో సంబంధం లేకుండా భరోసా కల్పించాలన్నారు. అంతర్జాతీయ హకీ క్రీడల్లో ఓడిపోయిన మహిళా క్రీడాకారులకు ఫోన్ చేసి ఓదార్చి భరోసా కల్పించిన ప్రధానిని ఆదర్శంగా తీసుకోవాలని సంజయ్ సూచించారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole