Telangana: శ్రీ మల్లికార్జున స్వామి అఖిలభారత మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం ట్రస్టు కొమురవెల్లి చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి లో జరుగుతున్న మున్నూరు కాపు సత్రం నిర్మాణ పనుల గురించి వివరించి.. ఎంపీ నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.ఇందుకు బండి సంజయ్ సానుకూలంగా స్పందించి తన వంతు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
కొమురవెల్లిలో మున్నూరు కాపు సత్రం నిర్మించడం చాలా గొప్ప విషయమని డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్ పద్మ దంపతులకు ఆ మల్లన్న స్వామి అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని కేంద్ర హోం శాఖ మంత్రి అభినందించారు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయమని.. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప విషయమని త్వరలో కొమురవెల్లి కి వస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు కుల బాంధవులు ఈ కార్యక్రమానికి సహకరించాలని రవీందర్ కోరారు.