పగలపడి నవ్వండి..నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

Sambashiva Rao :

నవ్వ‌డం ఓ యోగం, న‌వ్వించ‌డం ఓ భోగం, న‌వ్వ‌లేక‌పోవ‌డం ఓ రోగం అన్నారు పెద్ద‌లు. న‌వ్వుతూ నాలుగు కాలాలు బ్ర‌త‌క‌మ‌ని ఆశీర్వ‌దిస్తారు. అయితే కొంద‌రి ముఖం చూస్తే చిన్న చిరున‌వ్వు సైతం ఎంత వెతికినా క‌నిపించ‌దు. అలాంటి వారి ఫేస్ ఎప్పుడూ పేలాల పెనమే అంటారు. కొంద‌రూ మాట్లాడుతూంటే జోక్స్ పేలుతుంటాయి. వారు న‌వ్వ‌డ‌మే కాకుండా ఇత‌రుల‌ను కూడా న‌వ్విస్తుంటారు. కొంద‌ర‌యితే త‌మ తోటి వారు న‌వ్వితే చూసి ఓర్చుకోలేరు. నవ్వితే నాలుగు విధాలా చేటు అనడం పాత రోజులు. ఇప్పుడు నవ్వకపోతేనే ఆరోగ్యానికి చేటు అనే రోజులు ఇవి. కొందరు న‌వ్వి మ‌న‌స్సు తెలిక చేసుకుంటారు. మా క‌ష్టాలు, బాధ‌లు మీకు ఏం తెలుసు అంటారు. అలాంటి వారికి క‌ష్టాలు, న‌ష్టాలు, బాధ‌లు, ఎల్లప్పుడు ఉండ‌వు.. మ‌నిషిగా పుట్టిన ఎవ‌రైనా జీవితంలో న‌వ్వును అనుభ‌వించాల్సిందే. అస‌లు న‌వ్వు వ‌ల్ల‌ ఎన్నివిధాలుగా మంచి జ‌రుగుతుందో తెలుసా? నవ్వ‌డం వ‌ల్ల మ‌న మెద‌డుకి క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలుసా? మీరు ఒకసారి మ‌న‌సారా నవ్వారంటే చాలు అన్ని ఎమోష‌న్స్ కంట్రోల్ అవుతాయి. న‌వ్వువ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఎంటో తెలుసుకుందాం.

ముఖ్యంగా న‌వ్వ‌డం వ‌ల‌న మొద‌డులో ఎండార్ఫిన్స్ విడుద‌ల అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. మాన‌సిక ఉల్లాసం క‌లిగిస్తుంది. న‌వ్వితే న‌వ‌ర‌త్నాలు రాలిపోతాయా అనేలా మూతి బిగించుకుని కూర్చోవ‌ద్దు. మనకు వచ్చే రోగాల్లో గుండె జబ్బులు, డయబెటీస్, రక్తపోటు, డిప్రెషన్‌, ఇన్సోమియా, మైగ్రేన్ ఇలా 70 శాతం ఒత్తిడి వల్ల ఏర్పడేవే. ఇవి తొలగిపోవాలంటే ఎల్ల‌ప్పుడూ నవ్వాల‌ని.

నిత్యం న‌వ్వే వారి జీవిత కాలం కూడా 7 ఏళ్ల‌కంటే ఎక్కువ‌గా పెరుగుతుంది. ఒంటరిగా ఉండే వ్యక్తులకు..సరదాగా నలుగురితో కలిసి నవ్వేవారికి చాలా వ్య‌త్యాసం ఉంటుంది. నిత్యం నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ‌ని ఓ అధ్యాయ‌నంలో తేలింది. నవ్వు వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతుంది.

న‌వ్వు మాన‌వ సంబంధాలు మెరుగుప‌రుస్తుంది. న‌వ్వే వ్య‌క్తుల‌వైపు ఆక‌ర్షితులు అవుతాం. న‌వ్వు సృజ‌నాత్మ‌క‌త‌ను మెరుగుప‌రుస్తోంది. చేసే ప‌నిప‌ట్ల‌ ఏకాగ్ర‌త‌ను పెంచుతుంది.

రోజు చాలా మంది ఉద‌యాన్నే లాఫింగ్ థెర‌ఫీ ప్రారంభిస్తారు. పది నిమిషాలు నవ్వడం వల్ల 10-20 మి.మీల రక్తపోటు తగ్గుతుందని… ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల శ్రావకాలు తగ్గుముఖం ప‌డ‌తాయి. లాఫింగ్ మాన‌సిక స్థితిని పెంచే వ్యాయామం అని అభిప్రాయం.

రోజులో క‌నీసం 10 నుంచి 20 నిమిషాలు న‌వ్వ‌డం వ‌ల్ల ఆనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మై..బ్రెయిన్ చాలా చూరుగ్గా ప‌నిచేస్తుంది. మాన‌సికంగా ఉన్న మ‌త్తు, వేధించే ఒత్తిడి వ‌ద‌లిపోతాయి.

సో చూశారుగా మ‌నం నిత్యం న‌వ్వ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు. క‌లియుగ విశ్వామిత్రుడిగా ఉండిపోకండి. న‌వ్వండి న‌వ్వుతూ ఉండండి.ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Optimized by Optimole