మేజర్ టీజర్ విడుదల!

విభిన్న పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో అడవిశేష్. చేసింది తక్కువ సినిమాలే అయిన సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అతను తాజాగా నటించిన చిత్రం. శశికిరణ్ దర్శకుడు. జిఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం టీజర్ తెలుగులో మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్విరాజ్ సోమవారం విడుదల చేశారు. టీజర్లో.. ‘‘మన బోర్డర్‌లో ఆర్మీ ఎలా ఫైట్‌ చేయాలి? ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’’ అంటూ శేష్‌ చెబుతున్న డైలాగ్స్‌ అద్భుతంగా ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీశర్మ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జులై 2న ఈ చిత్రం విడుదల కానుంది.