మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.. ప్రత్యేక వీడియోనూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సోమవారం విడుదల చేసింది. కాలుమీద కాలు వేసుకుని కూర్చోని.. డాషింగ్ లుక్ తో చిరు పవర్ పుల్ గా కనిపించారు. చిరు నడకకు తగ్గట్టు..తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టింది. చాలాకాలం తర్వాతా చిరును మాస్ లుక్ లో చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వయస్సు పెరిగినా ఆయన స్టైల్ లో ఏమాత్రం ఈజ్ తగ్గలేదని.. చిరు ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేశారు.
ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే ఫస్ట్ లుక్ నూ విడుదల చేసింది.ఆచార్య తర్వాత చిరు నటిస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మోహన్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ,నయనతారా, సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.