తెలంగాణలో కమల వికాసం తథ్యమన్న మోదీ.. జోష్ లో కమలదళం.. !!

 

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కమల దళంలో నూతనోత్సహన్ని నింపింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిన గెలిచనంత పనిచేసిన కార్యకర్తలకు బూస్టప్ ఇచ్చేలా ప్రసగంతో స్పూర్తినింపారు మోదీ. గతంలో ఎన్నడూ లేని విధంగా తనదైన శైలిలీ చమత్కార పంచులతో వినోదాన్ని పంచారు.అదే తరహాలో అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ .. పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.తెలంగాణ ప్రజలను దోచుకున్న అవినీతి పరులను వదిలి పెట్టే ప్రసక్త లేదని మోదీ అల్టిమేటం జారీచేశారు.కుటుంబ పాలనకు అంతమొందించే సమయం ఆసన్నమైందని.. అంధకారంలో మగ్గుతున్న రాష్ట్రంలో కమల వికాసంతో సూర్యోదయం మొదలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎవరన్నది మోదీ చెప్పకనే చెప్పారన్న అంశం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

ఇక ప్రధాని మోదీ ప్రసంగం నిశితంగా పరిశీలించినట్లయితే..జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న కేసీఆర్ కు మోదీ పరోక్షంగా చేసిన విమర్శలు హెచ్చిరకలుగా భావించవచ్చు.అటు తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆజ్యం పోసేలా ..అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదంటూ మోదీ ఆల్టిమేటం జారీచేయడం చూస్తుంటే రానున్న రోజుల్లో రాజకీయం మరింత రసవత్తరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాక లిక్కర్ స్కాంలో రేపోమాపో కవితకు కాల్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఉచ్చు మరింతగా బిగుస్తుందన్న చర్చ తెరపైకి వచ్చింది.వీటితో పాటు కాళేశ్వరం అవినీతిపై కూడ చర్చ జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ..మునుగోడు ఉప ఎన్నికలో ఓడినా.. నైతికంగా బీజేపీదే విజయమన్న ధీమా మోదీలో కనిపించింది.అంతేకాక తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే కమల వికాసం తథ్యమనే భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం ఏంటంటే? అవినీతి పరులను ..కుటుంబ పాలన వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందన్న ప్రధాని మాటల్లో.. వైఖరి ఏంటన్నది స్పష్టం గా అర్థమవుతోంది.కేసీఆర్ ను గద్దే దించడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని.. ఒక్క సీటు ఉన్న త్రిపురలొ అధికారంలోకి వచ్చామని చెప్పడం చూస్తుంటే ..తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలనే పట్టుదల మోదీలో కనిపించింది.

కాగా ప్రధాని ప్రసంగంలోని మరో అంశం.. మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ కమలదళం పోరాట పటిమను కొనియాడడం.తృటిలో విజయం చేజారిందే తప్ప.. నైతికంగా బీజేపిదే విజయమన్న భావన మోదీ మాటల్లో కనిపించింది.ఇదే తీరునా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోరాడితే..అధికారం మనదే అన్న భరోసా కాషాయ కార్యకర్తలకు కల్పించారు మోదీ. నేతలంతా ఐకమత్యంగా పోరాడాలని .. పార్టీని బూత్ లెవల్ స్థాయిలో తీసుకుపోయిందేకు కృషిచేయాలని దిశానిర్థేశం చేశారనే చెప్పవచ్చు.అంతేకాక అధికార పార్టీ ఉడుత ఊపులకు భయపడకుండా.. కార్యకర్తలు పనిచేస్తున్న తీరు బాగుందని.. తాను సైతం సాధారణ బీజేపీ కార్యకర్తను అంటూ మోదీ చెప్పుకున్న విధానం పార్టీలకు అతీతంగా ఆకట్టుకునే అంశంగా పరిగణించవచ్చు.

మొత్తంమీద తెలంగాణలో మోదీ పర్యటన కమలం నేతల్లో జోష్ నింపడంతో పాటు ..అధికార పార్టీ నేతలకు హెచ్చరికలను జారిచేసింది. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయం మరింత రసకందాయంగా ఉండబోతోంది.

Optimized by Optimole