నళినిని చూసి నేర్చుకోవయ్యా, రాహుల్..!!

నళినిని చూసి నేర్చుకోవయ్యా, రాహుల్..!!

Nancharaiah merugumala :

………………………………………………..

రాజీవ్ గాంధీ చావుకు కారణమైన పేలుడులో ఆప్తులను కోల్పోయిన వారికి నా విచారం తెలుపుతున్నా. వారి గురించి ఆలోచిస్తూ నేను ఎన్నో ఏళ్లు గడిపానూ అంటూ అవేదనను వెలిబుచ్చిన 53 ఏళ్ల తమిళ వీర వనిత నలినీ శ్రీహరన్. రాజీవ్ హత్య కేసులో శిక్షించదగ్గ పాత్ర లేకున్నా 30 ఏళ్లకు పైగా కారాగారం లో మగ్గిపోయింది. శిక్ష అనుభవించే క్రమంలో  జైల్లోనే ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు భర్త మురుగన్, కూతురు హరితతో కలిసి బతకాలనే ఆలోచనలో ఉంది.

   ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా పంజాబ్ లో, స్వర్ణాలయంలో వేలాది మందిని ఊచకోత కోశారు. ఆమె పెద్ద కొడుకు పాలనలో వేలాది మంది శ్రీలంక తమిళులను భారత సిపాయిలు కాల్చిచంపారు. ‘పెద్దపులి’ వెలుపిళ్ళై ప్రభాకరన్ ను తుపాకీతో బెదిరించి మరీ భారత-శ్రీలంక శాంతి ఒప్పందంపై సంతకం చేయించారు రాజీవ్ మనుషులు.  ఈ హత్యలపై నెహ్రూ-గాంధీ కుటుంబం ఏ నాడూ విచారం ప్రకటించలేదు. పంజాబీలనుగాని, తమిళులనుగాని క్షమాపణ కోరలేదు. అందుకే ఈ కుటుంబంలో చివరి ప్రధానిగా రాజీవ్ గాంధీ నిలిచిపోయారు. ఓట్లే తప్ప అపాలజీ అడగడం ఇష్టపడని ఈ దుర్మార్గ పరివారానికి 2024లో ఏం జరుగుతుందో మరి.