Vikarabad: బీజేపీలో మాంసాహారులకు స్థానం లేకపోతే పార్టీ ఎలా బలపడుతుంది?: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్: “మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదని ఎవరైనా భావిస్తే, అలా బీజేపీ ఎలా బలపడుతుంది?” అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మీకు దేశభక్తి ఉంటే, దైవభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళ్‌లలో చేరండి. బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో ఉండే అర్హత మీకు ఉండదంటూ” తీవ్ర స్థాయిలో స్పందించారు. పార్టీని వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కొంతమంది వల్లే బీజేపీ బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఒక రాజకీయ పార్టీ అని, దానిలో ప్రజలతో మమేకమై ఉండే గుణం అవసరమని, మాంసాహారులకి స్థానం లేకుండా చేస్తే పార్టీని ఎలా విస్తరించగలం? అని ప్రశ్నించారు.

“ మోదీ అండతో గెలుస్తామని అధ్యక్ష పదవుల కోసం కొట్టుకోవడం కాకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీ లోపాలపై నిస్సంకోచంగా మాట్లాడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Optimized by Optimole