sambashiva Rao:
===========
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఎంత కూల్ గా ఉంటాడో తెలిసిందే. మ్యాచ్ అనంతరం బయట ఇంటర్వ్యూల్లో కూడా చాలా కూల్ గా సమాదానాలు ఇస్తుంటాడు.ఇక ధోనీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువేగానే ఉంటుంది. ఇంటర్వ్యూల్లో తల చెప్పే చమత్కార సమాధానాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ధోనికి సంబంధించిన ఓవీడియో సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది.
కాగా 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దేశీయ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో చైన్నె సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినప్పటికీ అభిమానుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా బాలీవుడ్ నటి మందిరా బేడి ఓ ప్రోగ్రామ్‌లో భాగంగా ధోనీని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్య్యూలో ధోనీ ఇచ్చిన ఫన్నీ ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Thug Life – @msdhoni pic.twitter.com/Ux6gS5XsGi
— DIPTI MSDIAN (@Diptiranjan_7) October 4, 2022
మందిరా బేడి ఇంటర్వ్యూలో భాగంగా ధోనీని ఇరుకున పెట్టాలని కొన్ని ఫన్నీ ప్రశ్నలు వేసింది. మీకు మూల్యమైన గిప్ట్ ఏంటి? అని మందిరా అడిగింది. ధోనీ ఏం చెప్పాలా? అని ఆలోచిస్తుండగా.. మందిరా బేడి ‘‘నేను హింట్ ఇస్తున్నా.. తన కూతురు’’ అని నెమ్మదిగా ధోనీకి వినపడేలా చెప్పింది. ధోనీ తల అడ్డంగా ఊపాడు. ఆ వెంటనే ధోనీ నవ్వుతూ.. ‘‘అది గిప్ట్ కాదు.. హార్డ్‌వర్క్’’ ఫన్నీగా సమాధానాలు చెప్పాడు. దానికి మందిరా బేడితో పాటు అందరూ కూడా పడిపడి నవ్వారు