T20worldcup2022: టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన జట్లన్ని తమ కసరత్తు ప్రారంభించాయి. అయితే పొట్టి ఫార్మాట్లో ఇప్పటికే సత్తాచాటిన ఆఫ్గానిస్థాన్ జట్టు ఆతిధ్య జట్టు ఆసీస్ తో తలపడనుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు ముఖా ముఖి ఒక్క టీ20 మ్యాచ్‌లో తలపడలేదు. ఈ నేపధ్యంలో ఆఫ్గాన్- ఆస్ట్రేలియా జట్లు తలపడడం టీ20 చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈ రెండు జట్లు సూపర్-4లో భాగంగా నవంబర్ 4న ఆడిలైడ్ వేదికగా పోటీ పడనున్నాయి.
టీ20 క్రికెట్ చరిత్రలో ఆఫ్గాన్- ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్‌లో కూడా తలపడలేదు. ఆఫ్గాన్- ఆస్ట్రేలియా జట్లు తమ తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి.
కాగా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా-ఆఫ్గానిస్తాన్ వన్డేల్లో మాత్రమే తలపడ్డాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు ఆడిన మూడు వన్డేల్లో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. అయితే ఈసారి టీ20 ఫార్మాట్ కావడంతో గతంలో కంటే ఆఫ్గాన్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉంది. ఈసారి మాత్రం ఆస్ట్రేలియాకి ఆఫ్గాన్ నుంచి బలమైన పోటీ ఎదురుకానుంది.
ఇక ఆస్ట్రేలియా వేదికగా ఆక్టోబర్ 15 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలుత రౌండ్-1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్-22 నుంచి సూపర్-12 పోటీలు మొదలకానున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి.
ఆస్ట్రేలియా జట్టు
ఆరోన్ ఫించ్ (సి), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా. అఫ్గనిస్తాన్ జట్టు:
మహ్మద్ నబీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, కైస్ అహ్మద్, ఉస్మాన్ ఘని, ముజీబ్‌జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సలీం సఫీ, రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, ఫజల్ హక్ ఫారుకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్.