రామరాజ్యమే లక్ష్యం : బండి సంజయ్

తెలంగాణలో రామ రాజ్యమే తమ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెరాస విస్మరించిందని,రానున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో పట్టభద్రుల తగిన రీతిలో బుద్దిచెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మీద నమ్మకంతో ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేరు మార్చి, తమ పథకాలుగా ప్రచారం చేస్తున్నారని సంజయ్ ఆరోపించాడు. కాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియజకవర్గాన్ని పోచారం కుటుంబ సభ్యులు దోచుకొని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత మాల్యాద్రి రెడ్డి తోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలను పార్టీ కండువా కప్పి సంజయ్ బీజీపీలోకి ఆహ్వానించారు.