చిచ్చులు పెట్టే ముఖ్యమంత్రి మనకెలా మేలు చేస్తారు: నాదెండ్ల మనోహర్

Janasena: సమాజం ను కులాల వారీగా చీల్చితే, తనకు ఓట్లు పడతాయి అని భావించి పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టించిన ముఖ్యమంత్రి పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. ప్రజల్లో చిచ్చు పెట్టడం కోసం క్యాబినెట్ లోని సహచర మంత్రి, తన పార్టీ శాసనసభ్యుడు ఇళ్లను తగులబెట్టించిన పెద్ద మనిషి మనకు ఎలా మంచి చేస్తాడనేది ప్రజలంతా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వనరులు మింగేసే కుటుంబాలు.. ఏ పని అయినా చేస్తే నాకేం మిగులుతుంది అని ఆలోచించే నాయకుల పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజల కోసం, వారి బాగు కోసం, అభివృద్ధి కోసం ఆలోచించే నాయకులే లేరన్నారు. పదవీ కాలం పూర్తయ్యే సరికి ఎన్ని కోట్లు మిగిలాయి? ఎన్ని వేల కోట్లు కుటుంబం కోసం వెనకేసుకున్నాం అని ఆలోచించే వారి కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ నడుస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. సొంత కష్టార్జితాన్ని కష్టాల్లో ఉన్న పేదలకు పంచే గొప్ప మనసున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే ఆయన ముఖ్యమంత్రి కావడం తప్పనిసరని.. దీనిని ప్రతి ఒక్కరూ ఆలోచించాల’ని మనోహర్ పేర్కొన్నారు.

కాగా  తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, చక్రాయపాలెం గ్రామంలో ఆదివారం  రాత్రి నిర్వహించిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “రాష్ట్రంలో రైతాంగానికి నష్టం జరిగితే కనీసం వారిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.  రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభ దశలో ఉందన్నారు. రైతులు వలసలు వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇటీవల రైతులను కలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ తో కలిసి తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు అక్కడున్న రైతులు చెప్పిన సమస్యలు వింటే కళ్లు చెమర్చాయని వాపోయారు. ఈ ప్రభుత్వ విధానాలు రైతుకు ఏ మాత్రం మేలు చేసేవిగా లేవన్నారు. కేంద్రం ఇస్తున్న రూ. 7,500 కి తోడు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 6,500 ఇచ్చి చేతులు దులుపుకుంటోందని దుయ్యబట్టారు.బటన్ నొక్కితే జీవితాలు బాగుపడిపోవని.. క్షేత్రస్థాయిలో రైతులు బాధలను కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మనోహర్ ఫైర్ అయ్యారు. 

 

 

 

 

 

Optimized by Optimole