kavita: మల్లన్నపై నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ మండిపాటు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ తీన్మార్ మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

‘‘గౌరవ జాగృతి అధ్యక్షురాలు అయిన కవితక్కని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న చేసిన అసభ్య వ్యాఖ్యలు తగినవి కావు. ఆయన వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే నాలుక కోస్తా ఖబర్దార్ అంటూ రాచమల్ల బాలకృష్ణ హెచ్చరించారు.

Optimized by Optimole