అక్రమ కేసుల నుంచి న్యాయమే మమ్మల్ని కాపాడుతుంది: నారా లోకేష్

APpolitics : అక్రమ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ…  మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లారు.. చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . చంద్రబాబునాయుడు ఆంధ్ర నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చి 2.15 మందికి శిక్షణ ఇచ్చి, 80వేలమందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. జవాబుదారితనంతో పనిచేయాలని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు చెప్పేవారని.. చంద్రబాబు యుద్ధప్రాతిపదికను పనులు చేయడం వల్లే పెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు.  45సంవత్సరాలు అహర్నిశలు పనిచేసి సైబరాబాద్ తోపాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను అభివృద్ధిచేశారని లోకేష్  వివరించారు.

 

కాగా ఏ తప్పు చేయని చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో తప్పుడు కేసుపెట్టి 24రోజులుగా చంద్రబాబును జైలులో పెట్టారని లోకేష్ వాపోయారు. 45సంవత్సరాలుగా తెలుగుప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసినందుకే చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గత 24రోజులుగా ప్రజలు శాంతియుతంగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారని.. మోతమోగిద్దాం కార్యక్రమంలో పెద్దఎత్తున సామాన్యులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపారని పేర్కొన్నారు. నిరసన తెలిపేందుకు విజిల్ వేసి, గంటకొడితే కేసు పెడతారా?అని ప్రశ్నించారు. ఇక నుంచి  ఆయనను  పిచ్చి జగన్ అంటున్నట్లు చెప్పుకొచ్చారు.  భువనేశ్వరమ్మ  పొలిటికల్ యాక్షన్ కమిటీలో అక్టోబర్ 2న నిరాహార దీక్ష  చేశారని.. ఆమెకు సంఘీభావంగా తాము కూడా దీక్ష చేపట్టినట్లు.. దీక్షలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే జడ్జి ముందు పెట్టాలని.. ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును జైలుకు పంపడమేగాక మరో 3కేసులు రెడీ చేశారని వెల్లడించారు. మంత్రులు రోజుకోసారి తనను.. భువనేశ్వరమ్మను.. బ్రాహ్మణిని జైలుకు పంపుతామని అంటున్నారని.. ఇది ముమ్మాటికీ కక్షసాధింపేనని.. అయినా తాము తగ్గే ప్రసక్తే లేదని .. పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. తమపై  పెట్టిన తప్పుడు కేసులను ఆధారాలతో సహా అన్నీ ప్రజల ముందు ఉంచుతామని.. మంగళవారం సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు వస్తుందని.. కోర్టు నిర్ణయాన్ని బట్టి పార్టీ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని యువనేత లోకేష్ స్పష్టం చేశారు.

 

Optimized by Optimole