“ఓటు” ప్రచారానికి లోటు..!!

ఓటుకు నోటు సంగతి ఎలా ఉన్నా..?

ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఓటు విలువ ఎన్నికల నాడు మినహా మరెప్పుడు జనం ఊసెత్తని పరిస్థితి. ఓటు విలువ తెలిసిన దేశాలు యువతరానికి 16 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని న్యూజిల్యాండ్‌ ప్రయత్నాలను తెరపైకి తెచ్చింది. స్వాతంత్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకొని , ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాలకు దిక్చూచిలా వ్యవహరిస్తున్న భారత దేశంలో మాత్రం ఓటు హక్కు కల్పన నేటికి అపహాస్యంగానే మిగిలి పోతు వస్తుంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలెకొంది. 18 సంవత్సరాలు నిండిన యువతి యవకులకు ఓటు హక్కు కల్పించడంలో ఎన్నికల కమిషన్‌తోపాటు ఆయా రాష్ట్రాల పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం అర్హత కలిగిన వారికి ఓటు కల్పించడంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనబరచడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొత్త ఓటర్లకు ఓటు హక్కును దరి చేర్చడంలో విఫలమవుతు వస్తున్నాయి. చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, బదిలీలతో ఇతర ప్రాంతాల మైగ్రేట్‌ వెళ్లిన వారికి ఓటును మార్పు చేయడం లేదు. జనాభాకు అతి దగ్గరగా ఉన్న ఓటు బ్యాంకులో ఎన్నో చిత్ర విచిత్రాలు దర్శనమిస్తుంటాయి. ఎన్నికలోస్తే తప్పా హడవిడి ప్రదర్శన కనబరచని ఎన్నికల కమిషన్‌ ఓటర్‌ లిస్టుల్లో పారదర్శత నిరూపనకు ప్రయత్నాలు చేయలేదనే వాదనాలు ఉన్నాయి.  

వజ్రోత్సవ వసంతాలు గడిచిన కొత్త ఓటు హక్కు కొరుకరాని కొయ్యనే..?

జనాభా పెరుగుదల.. తగ్గుదల లెక్కలను పక్కకు పెడితే…. ఓటరు లిస్టుల్లో దొర్లుతున్న తప్పులతోపాటు మైగ్రేషన్‌ ఓటర్ల మార్పు, చనిపోయిన వారి పేర్లు తొలగించడంలో  విఫలమవతున్నారనే అపవాదు ఎన్నికల కమిషన్‌పై ఉంది. ప్రతి సంవత్సర క్యాలండర్‌ ఇయర్‌ ప్రారంభానికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు ఫాం 6 ద్వారా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. ఈ ప్రక్రియలో బూత్‌ లెవల్‌ అధికారి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు బాధ్యత ఉంటుంది. కొత్త ఓటు హక్కు కు అర్హత కలిగిన వారికి ప్రత్యేక క్యాంపుల ద్వారా ఓటు కల్పించాలి. వారికి వెంటనే ఓటర్‌ ఐడి ఎఫిక్‌ కార్డులను కూడ అందించే బాధ్యత వారిపై ఉంటుంది. అర్హులైన.. కొత్తగా యువతకు ఓటు కల్పించడానికి అవకాశం ఉన్నా..వారి నుంచి పదో పరుక వచ్చె పరిస్థితి ఉండదని బూత్‌లెవల్‌ యంత్రాంగం తూతూ మంత్రంగా ఓటు కల్పించే ప్రక్రియను చేపడుతోంది. ఇదే బాటలో  ప్రభుత్వ పనుల మాటున రెవెన్యూ యంత్రాంగం ఓటర్ల జాబితాల సవరణ మరిచి పోతుంటారు. ఓటర్స్‌ డేగా పిలువబడే జనవరి 25న ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రజా ప్రతినిధుల సహకారంతో బూత్‌ స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్‌ స్థాయి  వరకు నిర్వహించాలి. కాని ఈ ప్రత్యేక క్యాంపుల నిర్వహిస్తున్న దాఖాలు తెలంగాణలో అక్కడక్కడ మినహ..అంతటా కనించవు. దీనికి తోడు ప్రతియేటా ఓటర్‌ నమోదు స్పెషల్‌ డ్రైవ్‌ పేరుతో ఆగస్టు 9, సెప్టెంబరు 10న, 24,25న నవంబరు 7,8,9న డిసెంబరు మొదటి శని, ఆదివారాల్లో నిర్వహించి అన్ని రకాల వారికి ఓటు హుక్క ఇవ్వడంతోపాటు లోటు పాట్లను సవరించాల్సి ఉంటుంది. ఇలాంటి పనితీరు పల్లె నుంచి పట్టణాల వరకు జరుగాలి. కానీ ఎక్కడ కనిపించడం లేదు.

 

గతంలో రాజకీయం తిరిగే నాయకులు, స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు నేరుగా ఓటర్లు వద్దకు వెళ్లి6` ఫారాలను వారితో నింపించి ఓటు హక్కు కల్పించే అవకాశం గతంలో ఉండేది. ఈ పద్దతికి ప్రజాప్రతినిధులు తిలోకదకాలు ఇచ్చారు. ఓటర్‌ లిస్టుల్లో వారికి ఎన్నికల సమయంలో ఓటుకు రూ. వేయి నుంచి రూ. పది వేలకు కొనుగోలు చేస్తే సరిపోతుందనే భావనలో ఉండి పోతున్నారు. కాదంటే ఎన్నికల లిస్టుల్లో పేర్లు ఉండి మైగ్రేషన్‌ ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవడానికి రూట్‌ మ్యాప్‌తో పోటీదారులు ముందుకు సాగుతున్నారు. కాని ఓటరు లిస్టుల్లో పారదర్శకతను ఏర్పాటుకు మాత్రం ఎవ్వరు కృషి చేయడం లేదు. ఇలాంటి లోపాలను సరిదిద్దడానికి అధార్‌కార్డును ఓటర్‌కు లింక్‌ చేయాలని ఎన్నికల కమిషన్‌ అలోచనలు చేస్లే.. పాలకులు, న్యాయవ్యవస్థలు ససేమిరా అంటున్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో ఓటర్‌ లిస్టుల్లో తప్పులను సరిచేయలేక పోతుండటంతో  ఎన్నికల కమిషన్‌ నిర్లప్తతకు నిదర్శనంగా నిలుస్తుంది.

18 సంవత్సరాలు నిండిన వారికి కొత్త ఓటు హక్కు అందని దాక్ష..? 

తెలంగాణలో 2011 లెక్కల ప్రకారం 3,50,03,674 జనాభా ఉంది. తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఈ మధ్య విడుదల చేసిన ఓటర్ల వివరాలను పరిశీలిస్తే..2,95,80,736 మంది ఓటర్లు ఉన్నారని చెబుతున్నారు. ఈ ఓటర్లలో 1,48,58,887 ఓటర్లు పురుషులుగాను, 1,47,02,391 మహిళ ఓటర్లుగా ఉన్నారు. థర్డ్‌జెండర్‌గా 1654 మంది ఓటర్లు ఉన్నారు. 2737 మంది ఎన్‌ఆర్‌ఐలు,15,067 మంది సర్వీస్‌ ఓటర్లుగా ఉన్నారు. తెలంగాణలో 18 నుంచి 19 సంవత్సరాలు నిండిన యువత 83,207 ఉంటారని అంచనాలు వేశారు. 33 జిల్లాలోని 119 మంది నియోజక వర్గాల్లో ఉన్న ఈ యువ ఓటర్లకు 34,891 బూత్‌ కమిటీల ద్వారా 2023 జనవరి 1లోపు ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుంది. కాని ఇప్పటి వరకు ఎంత మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించాలరని అనే సందేహాన్ని మాత్రం ఎన్నికల కమిషన్‌ నివృత్తి చేయలేక పోయింది. ఎన్నికల కమిషన్‌ 11,36,873 మంది ఓటర్లను బోగస్‌గా గుర్తించి వారిని తోలగించామని చెపుతున్నారు. కాని నిన్నమొన్న జరిగిన మునుగోడు ఎన్నికల్లో వలస ఓటర్లతోనే గెలుపు ఓటములు ఖరారయ్యాయని చెపుతున్నారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే తొలగించామని చెబుతున్న ఎన్నికల కమిషన్‌ మునుగోడు ఎన్నికల్లో పది వేలపైగా ఓటర్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు ఎలా వేశారు అనే సందేహాలు అందరిలోను కలుగుతున్నాయి. 

 

ఇదిలా ఉంటే..  ఎన్నికల కమిషన్‌ను ప్రత్యేక కోర్టులే నియమించాలని, కమిషన్‌ను రాజకీయ పార్టీలకు నియమించే అవకాశం ఉండ కూదని వాదనలు వినిపిస్తున్న కోర్టుల్లో 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు , మైగ్రేషన్‌ ఓటర్ల మార్పులకు, ఓటరు లిస్టుల్లో తప్పిదాలను సవరించిమని సూచించలేక పోతున్నాయనే అవేదన అందరిలోను చోటు చేసుకుంది.  ఓటుకు నోటే ప్రధాన అస్త్రంగా కొనసాగుతున్న  ప్రజా ప్రతినిధుల ఎన్నికలు.. ఓటరు లిస్టుల్లో పారదర్శకతకు కృషి చేయాల్సిన అవరసంఎంతైనా ఉంది. స్వయంప్రతిపత్తిగా కొనసాగుతున్న ఎన్నికల కమిషన్‌ ఎన్నికల రోజుల్లో కాకుండా సంవత్సరమంతా.. ఓటు హక్కు అందించడంలోను, ఓటరు లిస్టులోని తప్పులను సరిచేయడం లోను శ్రద్ద చూపించాల్సిన ఆవశ్యకత ఉందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

__________________________

– బొజ్జ రాజశేఖర్‌

పీపుల్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి

 

Optimized by Optimole