NellurRural: ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం.. ‘ఒక్కడే ఒంటరిగా’

APpolitics:  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘ మాట మంతి ‘  పేరిట ‘ ఒక్కడే ఒంటరిగా ‘ కార్యక్రమం చేపట్టబోతున్నారు.నియోజకవర్గంలోని  సుమారు లక్ష్య మందిని కలిసేలా ఈ పర్యటన సాగనుంది. ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు.  విజయ దశమి సందర్భంగా  కోటం రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 33 రోజుల పాటు జరిగే ‘మాట మంతి’ కోసం ఇప్పటికే  రూట్ మ్యాప్ సైతం సిద్దమైంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయన పర్యటన   సాగనుంది. మంది మార్భాలం లేకుండా కోటం  రెడ్డి ‘ ఒక్కడే  ఒంటరిగా’  ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకొని భరోసా కల్పించనున్నారు.

Optimized by Optimole