జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు తొలిరోజే జనం పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాల అనంతరం ర్యాలీగా వెళ్లిన జనసేనానికి అపూర్వ స్వాగతం లభించింది.
కత్తిపూడి బహిరంగ సభకు ర్యాలీగా వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దారిపొడవునా అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు.
అనంతరం కత్తిపూడి బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. వైసిపి ప్రభుత్వాన్ని పడగొట్టేది జనసేన మాత్రమేనని.. తాను ఎవరికి గులాంగిరి చేయనని.. ఓడిపోయిన పారిపోలేదని, పులిలా గర్జించానని పవన్ తేల్చి చెప్పారు.
కాగా బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. పార్టీని నడపడం అంత ఆషామాషి విషయం కాదని .. లక్ష కోట్లు కాదు ప్రజల గుండెల్లో అభిమానం ఉంటేనే పార్టీని నడపడం సాధ్యమని జనసేనాని చెప్పుకొచ్చారు.