literature: నిర్ణయించడానికి నీవెవరు..?
ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో,…