రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్ అటాక్..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చారు. రాజగోపాల్ బీజేపీలో చేరుతున్నారన్న అక్కసుతో రేవంత్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని బీజేపీనేతలు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై రేవంత్ చేసిన ఆరోపణల వీడియో క్లిప్పింగ్స్ చూపుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. సోనియాను బలిదేవతగా అభివర్ణించిన రేవంత్.. నేడు తెలంగాణ తల్లి అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ భాష మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. …