Bandisanjay: భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
Bandisanjay: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు. సోమవారం నుండి విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడివలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు. బండి…
Nalgonda: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు..!
Nancharaiah merugumala senior journalist: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు! తాటిపాముల, ఇనుపాముల, అయిటిపాముల, వానపాముల, కలవపాముల 1982 నుంచీ గుడివాడ – హైదరాబాద్ మార్గంలో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దగా ఎవరికీ పట్టని నాకిష్టమైన ఒక విషయం నేను గమనించాను. గుడివాడ నుంచి బెజవాడకు వెంట్రప్రగడ, మానికొండ, కంకిపాడు మీదుగా ఎక్కువ భాగం కృష్ణా నది కాలవ పక్కన రోడ్లపై పోతుంటే… వెంట్రప్రగడ లోపు ‘వానపాముల’ అనే గ్రామం వస్తుంది. తర్వాత వెంట్రప్రగడ…
Article370: ఆర్టికల్ 370 చుట్టూ జమ్మూ కశ్మీర్ ఎన్నికలు..!
Jammu Kashmir: మంచు లోయలతో పర్యాటకుల మనస్సులను ఆహ్లాదపరుస్తూ చల్లని వాతావరణంతో కేరింతలు కొట్టించే భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ వేసవి కాలం కాకపోయినా ఎన్నికల రాజకీయాలతో వేడెక్కుతోంది. పదేళ్ల అనంతరం ప్రత్యేకించి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాసనసభ ఎన్నికలు జరుగుతుండడంతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పండితులు జమ్మూ కశ్మీర్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఎన్నికలను అధ్యయనం చేస్తున్న విశ్లేషకులు, మీడియా వర్గాలు తమ తమ కోణాల్లో…
నిత్య స్ఫూర్తి… తరగని కీర్తి… పెద మల్లయ్యకు ఘననివాళి..!
Nalgonda: నెల్వలపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బూరుగు పెద మల్లయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని నెల్వలపల్లి గ్రామంలో ఆయన కుమారులు, ప్రణవా గ్రూప్ అధినేత బూరుగు రవికుమార్, ప్రణావా గ్రూప్ డైరెక్టర్ బూరుగు రాంబాబుల వ్యవసాయ క్షేత్రంలో సద్గురు- పీఠాధిపతులు శ్రీ శివానంద స్వామి ఆధ్వర్యంలో ఈ ప్రథమ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. బూరుగు రవికుమార్ ఆహ్వానం మేరకు ఆయన స్నేహితులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి…
Tirumala: తిరుమలలో క్రైస్తవులకే ‘డిక్లరేషన్’ పరిమితం చేస్తే మంచిదేమో!
Nancharaiah merugumala senior journalist: తిరుమలలో బ్రాహ్మణ, రెడ్డి, కాపు, కమ్మ క్రైస్తవులకే ‘డిక్లరేషన్’ నిబంధన పరిమితం చేస్తే మంచిదేమో! శ్రీవేంకటేశ్వరస్వామిపై తమకు విశ్వాసం ఉందని, ఆయనను దేవుడిగా పరిగణిస్తామనే… డిక్లరేషన్ తిరుమల కొండపై తిరుపతెంకన్న దర్శనం కోరే అన్యమతస్తులు ఇవ్వాలనే టీటీడీ నిబంధనను ఇక నుంచి..బ్రాహ్మణ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, కాపు క్రైస్తవులు ( మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు వంటి విశ్వాసులు), కమ్మ క్రైస్తవులకే ( దళిత క్రైస్తవ భార్య ఉన్న…
Haryana: కుల సమీకరణాల కుస్తీలో గెలుపెవరిది..?
Haryana election2024: ఆటల పోటీలలో పతకాల పంటను పండించే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా సాగుతున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో మాజిక్ ఫిగర్ 46 సీట్లను సాధించడానికి రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కుల సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో వరుసగా…