జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఓ భావోద్వేగ ప్రయాణమన్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీలో సభ్యులంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పే గొప్ప ప్రయత్నమని కొనియాడారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన క్రియాశీలక సభ్యులు.. కష్టాల్లో ఉంటే ఆర్థికంగా చేయూతనివ్వాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంకల్పించడం అభినందనీయమని తెలిపారు.క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలా జరగడం.. ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేందుకు ముందుకు రావడం గొప్ప విజయమని నాదెండ్ల పేర్కొన్నారు.
కాగా జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్వత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుందన్నారు నాదెండ్ల . గతంలో జనసేన పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే అంతా ముందుండి, సమష్టిగా సాయం చేసేవాళ్లమని గుర్తు చేశారు. ఓ క్రమపద్ధతిలో బీమాగా రూపొందించిన ఆలోచన పవన్ కళ్యాణ్ గారిదని కొనియాడారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు కష్ట సమయంలో నిలబడాలనేది పార్టీ ఆశయమని తేల్చిచెప్పారు. మొదటి విడతలో 90 వేల మంది క్రియాశీలక సభ్యులను.. రెండో విడతలో ఏకంగా 3 లక్షల 30వేల మంది క్రియాశీల సభ్యులుగా చేరారని మనోహర్ స్పష్టం చేశారు.