కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ తలరాతే మారిపోయింది. ఆఇండస్ట్రీ నుంచి సినిమా వస్తుందంటే చాలు సినీ ప్రేక్షకులు థియేటర్ కి క్యూ కడుతున్నారు. తాజాగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ నటించిన వేద గురువారం విడుదలైంది. కన్నడలో రీలీజైన ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి తెలుగులో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
కథ :
1980లో జరిగిన సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కింది. వేద (శివరాజ్‌కుమార్) , పుష్ప (గానవి లక్ష్మణ్) దంపతులు సాధాసీదా జీవితం గడుపుతుంటారు. ఈదంపతులకు కనక (అదితి సాగర్) ఏకైక సంతానం. ఊరిగోడవల కారణంగా వేద మూడు రోజులు జైలుకు వెళ్తాడు. అతను జైలు నుంచి విడుదలయ్యే సమయానికి భార్యను కొందరు కిరాతకంగా చంపేస్తారు. కూతురు(8)ను సైతం జైలుకు పంపిస్తారు. కూతురు జైలు నుంచి విడుదలైన మరుక్షణం .. ప్రతీకారంతో తన కుటుంబానికి అన్యాయం చేసిన ఒక్కొక్కరిని వెతికి వెతికి వేటాడతాడు . అసలు వేద భార్యను ఎవరు చంపారు? ఊర్లో అందరి ప్రేమను చూరగొన్న వేద ఫ్యామిలీకి అన్యాయం చేసిందెవరు? తెలియాంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే..?
రీవెంజ్ డ్రామాగా వేద తెరకెక్కింది. ఫస్ట్ ఆఫ్ కామెడీ, యాక్షన్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్. సెకాండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓకే. కొన్ని కొన్ని చోట్ల పాత తెలుగు సినిమాలు గుర్తొస్తాయి. అమ్మాయిల గొప్పతనాన్ని.. గౌరవించడం అంశాలను బెస్ చేసుకుని ఓమెసెజ్ ఇవ్వాలన్నది దర్శకుడు హర్ష తపనగా అనిపించింది. కన్నడ నాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈకథ.. తెలుగులో వర్కవుట్ అవడం కష్టమే.
ఎవరెలా చేశారంటే..?
సూపర్ స్టార్ శివన్న యాక్టింగ్ పరంగా ఇరగదీశాడు. ఎమోషనల్ , యాక్షన్ సీన్స్ చింపేశాడు. గానవి లక్ష్మణ్ నటన ఆకట్టుకుంటుంది. కూతురు పాత్రలో సింగర్ ఆదితి సాగర్ జీవించేసింది. ఆమె నటన సినిమాకు హైలెట్. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతికత..
వేద సినిమాకు సినిమాటోగ్రఫీ బలం. ఎడిటింగ్ ఫర్వాలేదు. మ్యూజిక్ పరంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవడం కష్టమే. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు ‘వేద’ ఓవ్యథే (సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)
రేటింగ్ : 2/5