రామ మందిర నిర్మాణానికి జనసేనాని భారీ విరాళం!

అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు శ్రీ భరత్ జీ గారిని కలిసి చెక్కును అందజేశారు. అతనితో పాటు వ్యక్తిగత సిబ్బంది సైతం ఆలయానికి విరాళమిచ్చారు( రూ. 11000) . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తిరుపతి ఉప ఎన్నిక దగ్గరపడుతుండడంతో పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశమయ్యారు.