Janasenavarahi:
• డి గ్యాంగ్ అరాచకాలను అరికట్టకపోతే భవిష్యత్తు లేదు
• ఇప్పటికే రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా తయారైంది
• నాయకులను చూసి, కార్యకర్తలూ అరాచకవాదులుగా తయారవుతున్నారు
• ప్రశాంతమైన కాకినాడను క్రిమినల్స్ అడ్డాగా మార్చేస్తున్నారు
• కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నాడు
• సకలం దోచేస్తూ… గూండాగిరి చేస్తున్నాడు
• ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా కూడబెట్టింది రూ.15 వేల కోట్లు
• గంజాయి మత్తు, బియ్యం మాఫియా, ఇసుక దోపిడీలే రాష్ట్రానికి శత్రువులు
• మహిళల అక్రమ రవాణాకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారింది
• శాంతిభద్రతలనేవి పూర్తిగా కనుమరుగు
• ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ గెలవనీయకుండా చూసుకుంటాం
• జగన్ ప్రభుత్వ అవినీతి, ద్వారంపూడి అరాచకాలపై ఆన్లైన్ వేదికగా యుద్ధం
• కాకినాడలో వారాహి విజయయాత్ర బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందన్నారు
జనసేన అధ్యక్షలు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోవచ్చన్నారు. ఇప్పటికే బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని.. అడుగడుగునా అవినీతి, మహిళల అక్రమ రవాణా, గంజాయి మత్తు, ఇసుక దోపిడీ, స్థలాల కబ్జా ఇలా ప్రతి విషయంలోనూ సామాన్యులు పడుతున్న వేదనలు నిత్యం చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పెన్షనర్స్ హెవెన్ గా ప్రశాంతమైన నగరంగా పేరున్న కాకినాడను క్రిమినల్స్ కి అడ్డాగా మార్చేస్తోంది వైసీపీ ప్రభుత్వమని.. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయని పవన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి డి గ్యాంగులు గెలిస్తే, పూర్తిగా మన ఇళ్లను కూడా దోచుకునే పరిస్థితి వస్తుంద’ని హెచ్చరించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడలో సర్పవరం జంక్షన్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. “కాకినాడ నగర నడిబొడ్డున ఉండి చెబుతున్నాను.. ఈ నగరం ఎమ్మెల్యే డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడలో మరోసారి గెలవకుండా పవన్ కళ్యాణ్ చూసుకుంటాడన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాత కాలం నుంచి ఇలాంటి అరాచకాలే రాజ్యమేలుతున్నాయని పవన్ మండి పడ్డారు.
నాడు డీటీ నాయక్ ట్రీట్మెంట్ ఇస్తే… త్వరలో భీమ్లా నాయక్ ఇస్తాడు..
చంద్రశేఖర్ రెడ్డి తాత అక్రమ బియ్యం, దొంగనోట్లు, దౌర్జన్యాల్లాంటివి చేస్తుంటే అప్పట్లో ఈ జిల్లాకు ఎస్పీగా వచ్చిన ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ అతన్ని నడిరోడ్డు మీద చేతులకు బేడీలు పోలీసు జీపు వెనుక నడిపించారన్నారు పవన్. మళ్లీ ఈ డి గ్యాంగు డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని ఈ భీమ్లానాయక్ కూడా అదే తీరున రోడ్డుపై నడిపేంచే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అధికార మదం ఎక్కి, తాగిన మైకంలో ఈ ఎమ్మెల్యే నా మీద నోటికొచ్చినట్లు మాట్లాడాడని.. దిగజారి మరీ బూతులు పచ్చిగా తిట్టాడని..నన్ను తిట్టినందుకు కోపం వచ్చి ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు జనసైనికులు, వీర మహిళలు వెళితే ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడులు చేశారని మండి పడ్డారు. నన్ను తిట్టినందుకు కాదు.. మా వీర మహిళలను అసభ్యంగా ద్వారంపూడి అనుచరులు దాడి చేసినపుడు నాకు కోపం వచ్చిందన్నారు. కచ్చితంగా ఈ ఎమ్మెల్యేను బలంగా ఎదుర్కోవాలని సంకల్పించానని.. క్రిమినల్స్ తో నిండిపోయిన వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం కలుగుతుందని 2014 లోనే చెప్పానని స్పష్టం చేశారు. రౌడీయిజం, గుండాయిజం, దోపిడీ, లూటీ, కబ్జా, అవినీతిలకు మూలంగా మారిపోయిన ఈ ప్రభుత్వంలో నేరం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఎదురు తిరుగుతాం.. వారిని ప్రశ్నిస్తామని పవన్ తేల్చిచెప్పారు.
కాకినాడను క్రిమినల్ కోటగా ఎమ్మెల్యే చేసుకున్నాడు..
ఒకటి కాదు రెండు కాదు… వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే బియ్యం అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్ము అక్షరాలా రూ.15 వేలు కోట్లని.. గోదావరి జిల్లాలకు అనధికార ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని పవన్ దుయ్యబట్టారు. కాకినాడలో అక్కడ ఇక్కడ అని కాదు.. కనిపించిన ప్రతి ఆస్తి, అగుపించిన ప్రతి భూమి ప్రజల నుంచి లాగేసుకుంటున్నాడని ఆరోపించారు. కాకినాడ కేంద్రంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యం విస్తరించిందన్నారు. ముఖ్యమంత్రి అండ చూసుకొని చెలరేగిపోతున్న ఈ ఎమ్మెల్యే వ్యవస్థలను చెప్పుచేతల్లోకి తీసుకొని అరాచకం సృష్టిస్తున్నాడని అన్నారు. కచ్చితంగా ప్రతి తప్పుకు ప్రజలకు సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని జనసేనాని హెచ్చరించారు.