జగిత్యాల: తెలంగాణ ప్రముఖ పుణ్యంక్షేత్రం కొండగట్టు ఆలయాన్నిజనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించారు. ఆలయ అధికారులు పవన్ కి ఘనంగా స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేయించారు.ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి.. సింధూరంతో శ్రీరామదూత్ అని పవన్ రాశాడు. ప్రారంభసూచకంగా వాహనాన్ని నడిపాడు. ఇక పవన్ పర్యటన సందర్భంగా ..జనసేన కార్యకర్తలు, అభిమానులు ,నేతలు.. కొండగట్టుకు భారీగా తరలివచ్చారు.