Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతాంగాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకొని.. అక్కడి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులకు భరోసా కల్పించనున్నారు. పలు నియోజక వర్గాల మీదుగా జనసేనాని పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు.