విజయవాడ: ఏపీలో వైసీపీ ఆరాచక పాలనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు.ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి నేడు పాదయాత్ర, నిరసనలకు అడ్డు తగులడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యలను చెపితే ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. జగన్ కు బుద్ధి చెప్పాలంటే ఛలో అసెంబ్లీ కచ్చితంగా నిర్వహించి తీరాలని తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇక గన్నవరం లో మహిళ టీచర్స్ ను దారుణంగా పోలీస్ ల తో ఈడ్చి పారేసిన ఘటన కలిచివేసిందన్నారు పద్మశ్రీ. మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రశ్నించలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి ప్రజలే హిట్లర్ అని పేరు పెట్టారని ఎద్దేవ చేశారు. బి. ఆర్ అంబేద్కర్ 125 అడుగులు విగ్రహం పెడుతున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్న వైసీపీ లీడర్లు .. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని పద్మశ్రీ మండిపడ్డారు.