సమాచార హక్కు చట్టంపై హైకోర్టులో పిల్ దాఖలు..

సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సిఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెలుసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సిఎస్ జీవో ఇవ్వడం సహచట్టాన్ని నిర్వీర్యం చేయడమే అన్నారు.
ఇక సమాచార హక్కు చట్టం కింద ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని ఈ నెల 13న సీఎస్ జీవో జారీ చేశారు. కొందరు ఫైల్లు సరిగా పరిశీలించకుండానే వివరాలు ఇస్తున్నారని..అందుకే ఆదేశాలిచ్చామన్నారు సీఎస్.

Optimized by Optimole